![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -125 లో... చందు పది లక్షలు ఎలా తీసుకొని రావాలని టెన్షన్ పడుతుంటే వెనకాల నుండి రామరాజు వచ్చి తన భుజంపై చెయ్యి వేస్తాడు. దాంతో చందు టెన్షన్ పడతాడు. ఏమైందని రామరాజు అడుగగా.. ఏం లేదని చందు అబద్ధం చెప్తాడు. నువ్వు నా కొడుకువే కాదురా నా నమ్మకానికి ప్రతిరూపమని రామరాజు అని తన పెద్ద కొడుకుపై ప్రేమని చెప్తుంటాడు. మా నాన్న పరువు పోకూడదు.. ఈ పెళ్లి జరగాలి ఎలాగైనా పది లక్షలు తీసుకొని రావాలని చందు అనుకుంటాడు. మరొకవైపు అల్లుడు గారు ఎలాగైనా పది లక్షలు తీసుకుని వస్తాడు.. నాకు నమ్మకం ఉంది.. తండ్రి మాట కంటే ఇప్పుడు భార్య మాటనే వింటాడని భాగ్యం తన వాళ్ళతో చెప్తుంది.
ఆ తర్వాత వేదవతి కుటుంబంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. పిండి వంటలు చేస్తుంటారు. మా అమ్మ పిండి వంటలు బాగా చేస్తుందని నర్మద బాధపడుతుంది. మీ వాళ్ళు పెళ్లికి పిలిస్తే వస్తారా అని వేదవతి అంటుంది. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా ఎలా వస్తారని వేదవతి అంటుంటే ఆ లేచిపోయి వచ్చింది కూడా మీ కొడుకు కోసమే కదా అని నర్మద అంటుంది.
తన వాళ్ళని గుర్తుచేసుకొని నర్మద ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు నీ వాళ్ళు వస్తే హ్యాపీనా ఒకసారి అటు చూడు అని వేదవతి అనగానే అప్పుడే నర్మద వాళ్ళ అమ్మ వస్తుంది. తనని చూసి నర్మద ఎమోషనల్ అవుతుంది. నా కోసం వచ్చావా అమ్మ అని నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ అత్తయ్య వల్లే ఇక్కడికి వచ్చానని చెప్తుంది. నర్మద పేరెంట్స్ తో వేదవతితో మాట్లాడిన విషయం నర్మద వాళ్ళ అమ్మ చెప్తుంది. నర్మద వాళ్ళ అమ్మ తనకి చీర నగలు తీసుకొని వస్తుంది. దాంతో నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |